Fri Dec 19 2025 02:36:30 GMT+0000 (Coordinated Universal Time)
ప్రవళిక కుటుంబానికి ఆ మాట ఇచ్చిన కేటీఆర్
ప్రవళిక కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేమని.. నిందితుడిని

ప్రవళిక కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేమని.. నిందితుడిని పట్టుకుని చట్టపరంగా శిక్షపడేలా చూస్తామని మర్రి ప్రవళిక కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రగతి భవన్లో కేటీఆర్‌ను మర్రి ప్రవళిక కుటుంబ సభ్యులు బుధవారం కలిశారు. ప్రవళిక కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ ధైర్యం చెప్పారు.
ప్రవళిక కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్‌ను కలిసిన అనంతరం ప్రవళిక సోదరుడు ప్రణయ్ మాట్లాడుతూ.. కేసు పురోగతిపై డీజీపీతో మాట్లాడినట్లు కేటీఆర్ చెప్పారని.. తమ కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో కేటీఆర్‌ను ప్రవళిక తల్లితండ్రులు, తమ్ముడు ప్రణయ్ కలిశారు. కరీంనగర్లో పర్యటించిన మంత్రి కేటీఆర్ ప్రవళిక మృతిని కూడా రాజకీయం చేశారని ఆరోపించారు. ప్రవళిక కుటుంబ సభ్యులు నా దగ్గరకు వచ్చారు.. న్యాయం చేయాలని కోరారు. ప్రవళిక కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.
Next Story

