Sun Mar 15 2026 20:00:18 GMT+0530 (India Standard Time)
హరీశ్‌రావుకు కోమటిరెడ్డి వార్నింగ్
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలపై ఆయన మండిపడ్డారు.

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలపై ఆయన మండిపడ్డారు. ప్రతి పనికీ అడ్డం తగులుతూ అభివృద్ధికి ఆటంకంగా మారారని అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
మూసీ నది నీటితో...
మూసీ నది నీటితో కోటి మంది ఎఫెక్ట్ అవుతున్నారన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూసీని శుద్ధి చేస్తామంటే.. కేటీఆర్ అడ్డుపడుతున్నారని తెలిపారు. రుణమాఫీపై హరీష్‌రావు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీనే నాలుగు విడతలు చేశారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Next Story

