Mon Mar 02 2026 13:21:07 GMT+0530 (India Standard Time)
దుబాయ్ లో చిక్కుకున్న మంత్రి తుమ్మల
దుబాయ్లో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిక్కుకున్నారు

దుబాయ్లో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిక్కుకున్నారు. ఐదు రోజుల క్రితం ఆయన దుబాయ్ వెళ్లారు. తన కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్ వెళ్లారు. ఈలోపు ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం మొదలయింది. దుబాయ్ లోనూ దాడులు జరుగుతున్నాయి.
సురక్షితంగానే ఉన్నానంటూ...
దుబాయ్ ఎయిర్పోర్టుపై దాడులు జరిగిన నేపథ్యంలో అన్ని విమానాలను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో తుమ్మల నాగేశ్వరరావు గత కొన్ని రోజుల నుంచి దుబాయ్ లోనే చిక్కుకుపోయి ఉన్నారు. అయితే తాను సురక్షితంగా ఉన్నానని, ఎయిర్పోర్టు క్లియర్లెన్స్ ఇచ్చేంత వరకు ఇండియా తిరిగి రాలేని పరిస్థితి ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి తుమ్మల తెలిపారు.
Next Story

