Fri Dec 05 2025 23:50:26 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు తెలంగాణ విమోచన దినోత్సవం.. అధికారికంగా నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ నిర్వహిస్తుంది. కాంగ్రెస్ విలీన దినోత్సవాన్ని, బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ నిర్వహిస్తుంది. కాంగ్రెస్ విలీన దినోత్సవాన్ని, బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో బీజేపీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈరోజు జరిగే కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ పాల్గొననున్నారు. ఆయన తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించాలన్న దానిపై ప్రజలకు వివరించనున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఏటా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ నిర్వహిస్తుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సెప్టంబరు 17వ తేదీని విలీనం దినంగా నిర్వహించేది. అయితే బీజేపీ మాత్రం విమోచన దినోత్సవంగానే నిర్వహించాలని నిర్ణయించింది.
1947 లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా?
1948లో హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్ లో విలీనం అయింది. విలీనం అయిన సెప్టంబరు దినోత్సవాన్ని విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1947 ఆగస్టు పదిహేనో తేదీన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం మాత్రం భారత యూనియన్ లో విలీనం కావడానికి పదమూడు నెలల సమయం పట్టింది. నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడంలో కీలక భూమిక పోషించారని బీజేపీ గుర్తు చేస్తూ ఏటా సెప్టంబరు 17న విమోచన దినోత్సవంగా నిర్వహిస్తుంది.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో
హైదరాబాద్ లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 17న వేడుకలను నిర్వహించనుంది. ఇందులో ఏర్పాటు చసిన ఫొటోఎగ్జిబిషన్ ను రాజ్ నాధ్ సింగ్ తిలకిస్తారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించి ప్రసంగిసత్ారు. దేశానికి 1947లో స్వాతంత్ర్యం లభించినప్పటికీ అప్పటి నిజాం స్వతంత్ర దేశంగా ప్రకటించకుండా అవసరమైతే పాకిస్తాన్ తో కలసి ఉంటామని ఐక్యరాజ్యసమితికి పంపుతామని లేకలు రాయడాన్ని బీజేపీ నేతలు తప్పు పడుతున్నారు. అందుకే గత రెండేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర గవర్నర్ జిష్ణదేవ్ వర్మ కూడా హాజరు కానున్నారు.
Next Story

