Fri Dec 05 2025 11:13:06 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : కవిత రాజీనామాపై కవిత రాజీనామాపై క్లారిటీ ఇదే
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాపై తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాపై తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనకు కవిత రాజీనామా అందిన తర్వాత ఆమెతో ఫోన్ లో మాట్లాడానని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఆవేశంతో తీసుకున్న నిర్ణయమని, రాజీనామాపై పునరాలోచించుకోవాలని తాను కవితకు సూచించినట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.
తాను మాట్లాడానని...
అయితే కల్వకుంట్ల కవిత మాత్రం తాను ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదని, ఆలోచించి నిర్ణయం తీసుకున్నానని తనతో చెప్పారని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని కవిత కోరారన్నారు. కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవి రాజీనామాపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాకు తెలిపారు.
Next Story

