Fri Dec 05 2025 09:28:08 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదరావు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది.

తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదరావు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. జులై 25వ తేదీన మూడు నెలల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాదరావు అడ్వకేట్ జనరల్, న్యాయనిపుణులతో చర్చించిన మీదట వారికి నోటీసులు ఇవ్వాలని అనుకుంటున్నారు.
సుప్రీం ఆదేశాల మేరకు...
బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు మద్దతుదారులుగా నిలవడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించి వారిపై అనర్హత వేటు వేయాలని కోరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, అరెకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ నోటీసులు ఇవ్వనున్నారు. వారి వివరణ తీసుకున్న తర్వాత దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Next Story

