Tue Sep 26 2023 02:55:31 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికలకు రెడీ అవుతున్న సీఈసీ
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతుంది. డిసెంబరులో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అవుతుంది.

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అంతా సిద్ధమవుతుంది. డిసెంబరులో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అవుతుంది. ఎన్నికలను సక్రమంగా జరిపేందుకు అవసరమైన చర్యలు తీసుకునే వాతావరణం రాష్ట్రంలో నెలకొందా? అన్న పరిస్థితులను కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు అంచనా వేయనున్నారు.
3రోజుల పర్యటన...
అందుకే వచ్చే నెలలో మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటించనుంది. అక్టోబరు మూడో తేదీ నుంచి మూడు రోజుల పాటు వారు రాష్ట్రంలో పర్యటించి ఇక్కడి పరిస్థితులపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికను ఇవ్వనున్నట్లు తెలిసింది. అక్టోబరు నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని చెబుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఏ ఏ అంశాలను పరిశీలిస్తుందన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఆ బృందం రాష్ట్ర అధికారులతో సమావేశమయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
Next Story