Fri Jan 30 2026 17:02:29 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో జనసేన పోటీ చేయనున్న స్థానాలు ఇవే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయనుంది. ఆ పార్టీ పోటీ చేసే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయనుంది. ఆ పార్టీ పోటీ చేసే స్థానాలను ఖరారు చేసింది. తెలంగాణలో మొత్తం 32 స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. కూకట్పల్లి, ఎల్బీనగర్, వైరా, ఖమ్మం, నాగర్కర్నూల్, మునుగోడు, కుత్బుల్లాపూర్, శేర్లింగంపల్లి, పటాన్చెరు, సనత్నగర్, కొత్తగూడెం, ఉప్పల్, అశ్వరావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘన్పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజూర్నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, ఖానాపూర్, మల్కాజిగిరి, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మధిరలో జనసేన పోటీ చేయనున్నట్లు పేర్కొంది.
తెలంగాణ ఎన్నికల్లో పోటీ అంశంపై పూర్తి సన్నద్ధతతో ఉన్నామని, ఈసారి పోటీలో ఉంటున్నట్టు జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి తెలిపారు. ఒకవేళ చివరి క్షణంలో పొత్తులేమైనా ఉంటే ఈ స్థానాల్లో మార్పులు ఉండొచ్చన్నారు. యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించారని, ఇందులో భాగంగా ఇప్పటికే నాయకత్వాన్ని తయారు చేసినట్టు మహేందర్ రెడ్డి చెప్పారు. దాదాపు 25 సీట్లలో పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉందన్నారు. గెలుపోటములు నిర్ణయించే స్థాయిలో తమ ఓటింగ్ ఉందని, గత ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికే ఇందుకు ఉదాహరణ అన్నారు. గత పదేళ్లలో అనేక సమస్యలపై తెలంగాణ జనసేన పోరాటం చేసిందన్నారు.
Next Story

