Sun Mar 15 2026 20:19:43 GMT+0530 (India Standard Time)
రాహుల్ ను కలిసిన కోదండరామ్
కరీంనగర్లో రాహుల్ గాంధీని తెలంగాణ జన సమితి నేత కోదంరామ్ కలిశారు. ఆయన రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు.

కరీంనగర్లో రాహుల్ గాంధీని తెలంగాణ జన సమితి నేత కోదంరామ్ కలిశారు. ఆయన రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. తెలంగాణలో నిరంకుశ పాలన పోవాలని రాహుల్ కూడా ఆకాంక్షించారని తెలిపారు. అయితే తాను రాహుల్ ను కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని అంతకు మించి మరొకటి లేదని ఆయన తెలిపారు.
పొత్తులపై....
పొత్తులు, సీట్లపై చర్చ తమ మధ్య జరగలేదన్నారు. ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించేందుకు అందరం ఏకం కావాలని రాహుల్ అభిప్రాయపడ్డారని ఆ తర్వాత కోదండరామ్ మీడియాకు తెలిపారు. అయితే కోదండరామ్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి పోటీ చేయనున్నారు. ఆయన రాహుల్ ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story

