Fri Dec 05 2025 22:47:53 GMT+0000 (Coordinated Universal Time)
కొలువుల జాతరపై కోదండరామ్ ఏమన్నారంటే?
తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ పై తెలంగాణ జన సమితి నేత కోదండరామ్ స్పందించారు. కేసీఆర్ ప్రకటన సంతృప్తికరంగా లేదన్నారు

తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ పై తెలంగాణ జన సమితి నేత కోదండరామ్ స్పందించారు. కేసీఆర్ ప్రకటన సంతృప్తికరంగా లేదన్నారు. 1,92 వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటే, కేవలం 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. అలాగే ఇప్పటి వరకూ 1,30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని కేసీఆర్ ప్రకటించారని, అది అవాస్తవమని కోదండరామ్ తెలిపారు. సమగ్రమైన ప్రకటన చేయాలని కోదండరామ్ కోరారు.
నిరుద్యోగ భృతి ఎక్కడ?
అలాగే 95శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, అదే సమయంలో ప్రయివేటు ఉద్యోగాల్లో కూడా దీనిని అమలు చేయాలని కోదండరామ్ కోరారు. కేసీఆర్ ప్రకటనలో నిరుద్యోగ భృతి అనేది లేనే లేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని కోదండరామ్ కోరారు.
- Tags
- kodandaram
- kcr
Next Story

