Sat Dec 13 2025 22:34:14 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : పుచ్చెలేచిపోద్ది.. బీఆర్ఎస్ నేతకు కవిత మాస్ వార్నింగ్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నేతను తీవ్రంగా హెచ్చరించారు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నేతను తీవ్రంగా హెచ్చరించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టమొచ్చినట్లు వాగితే ఊరుకునేది లేదని అన్నారు. వనపర్తిలో మీడియా సమావేశంలో మాట్లాడిన కల్వకుంట్ల కవిత తనను పచ్చు వంకాయ, సచ్చు వంకాయ అంటూ ఇంకొకసారి వాగితే పుచ్చె లేచిపోతుందని హెచ్చరించారు. ఇన్నాళ్లూ నిరంజన్ రెడ్డి వయసుకు గౌరవించానని, లేకుంటే ఎప్పుడో తాను విమర్శించేదానినని ఫైర్ అయ్యారు.
నా పని నేను చేసుకుంటూ వెళుతుంటే...
తన పని తాను చేసుకుంటూ పోతుంటే ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని తెలిపారు. నిరంజన్ రెడ్డి అవినీతి గురించి కేసీఆర్ కు తెలియదా? అని ప్రశ్నించారు. లేకపోతే ఆ అవినీతి కేసీఆర్ వద్దకు వెళ్లకుండా హరీశ్ రావు కాపాడారా? అంటూ ఎద్దేవా చేశారు. అయితే తాను మాత్రం నిరంజన్ రెడ్డి అవినీతి ఇంత వరకూ కేసీఆర్ కు తెలియదనే అనుకుంటున్నానని అన్నారు. నిరంజన్ రెడ్డి లాంటి నేతలను ఇప్పటికైనా పార్టీ పక్కన పెడితేనే మంచిదని బీఆర్ఎస్ నాయకత్వానికి సూచించారు.
Next Story

