Sun Mar 15 2026 16:43:33 GMT+0530 (India Standard Time)
Telangana : తెలంగాణలో ఐదు రోజలు పాటు వర్షాలేనట
తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది

తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక జిల్లాల్లో కురుస్తాయని తెిపింది. ఉపరితలల గాలుల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఎల్లుండి నుంచి...
నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత మొదలయిన వర్షాలు అప్పుడప్పుడు పడుతున్నాయి. అయితే రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న అనేక జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అయితే ఎల్లుండి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
Next Story

