Mon Mar 16 2026 18:40:25 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పదమూడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పెద్దపల్లి, మంచిర్యాల, కుమురంభీం, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈదురుగాలులు...
ప్రజలు ఈ ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు మాత్రమే కాకుండా రేపు కూడా వర్షాలు పడతాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు కరుస్తున్నాయని తెలిపింది.
Next Story

