Fri Dec 05 2025 13:36:08 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నేడు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

నేడు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవనున్నారు. ఈసారి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలని కోరనున్నారు. ఇప్పటికే యాభై రెండు లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.
ధాన్యం సేకరణపై...
మిగిలిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి విజ్ఞప్తి చేయనున్నారు. తెలంగాణలో వరి పంట సాగు విస్తీర్ణం పెరిగి పంట చేతికి రావడంతో ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని గోదాముల్లోనూ, రైస్ మిల్లుల్లోనూ ధాన్యం నిండిపోయి ఉందని, ధాన్యం తరలింపునకు మూడు వందల ట్రైన్స్ ఇవ్వాలని నేడు ప్రహ్లాద్ జోషిని కోరనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story

