Wed Jan 28 2026 23:33:58 GMT+0000 (Coordinated Universal Time)
ఇంటర్ ఫలితాలు మరింత ఆలస్యం..?
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇంటర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితలు ఈ నెల 25వ తేదీన విడుదలవుతాయని ప్రచారం జరిగింది. ఫలితాల విడుదలపై ఇంటర్మీడియట్ బోర్డు ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే అందిన సమాచారం మేరకు ఈ నెల 25వ తేదీన అంటే రేపు ఇంటర్ ఫలితాలు తెలంగాణలో విడుదల కావాల్సి ఉంది. కానీ అధికారులు మరికొంత సమయం తీసుకునే అవకాశముంది.
సాంకేతిక లోపాలు...
ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్ష పత్రాల వాల్యుయేషన్ పూర్తయింది. నిజానికి 25వ తేదీన విడుదల చేయాలనుకున్నా సాంకేతిక లోపాలు జరగకూడదని అధికారులు భావిస్తున్నారు. అందుకే మరికొంత సమయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నెల 25వ తేదీన కాకుండా 26వ తేదీన ఇంటర్ ఫలితాలను విడుదల చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించిన తర్వాత ఫలితాల తేదీని అధికారులు వెల్లడించనున్నారు.
Next Story

