Fri Dec 05 2025 14:59:40 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు నేడు ప్రభుత్వం విడుదల చేయనుంది

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు నేడు ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను నేటి మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఈ వెబ్ సెట్ లో ఫలితాలు...
ఇంటర్ ఫలితాల కోసం కొంతకాలంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరానికి మొత్తం దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే ఈ ఫలితాలను www.tebie,cgg.gov.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకునే వీలుంది.
Next Story

