Sat Jan 10 2026 22:41:43 GMT+0000 (Coordinated Universal Time)
శంకర్ వరప్రసాద్ కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 12వ తేదీ మూవీ విడుదల కానుంది. రేపు ప్రీమియర్ షోలకు కూడా ప్రభుత్వం అనుమతించింది. 11వ తేదీన స్పెషల్ ప్రీమియర్ లతో పాటు టిక్కెట్ ధరలను పెంచుకునేలా అనుంతి ఇచ్చింది. వారం రోజులు టికెట్ ధర పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
టిక్కెట్ ధరలను పెంచుతూ...
సంక్రాంతి సందర్భంగా చిరంజీవి నటించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో విడుదలవుతున్న మన శంకర్ వరప్రసాద్ సినిమాకు ప్రీమియర్ షో టిక్కెట్ ధర ఆరు వందల రూపాయలుగా నిర్ణయించింది. వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ లో యాభై రూపాయలు, మల్టీ ప్లెక్స్ లో వంద రూపాయలు టిక్కెట్ ధర పెంచుకునేలా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story

