Sat Mar 07 2026 21:55:29 GMT+0530 (India Standard Time)
ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై నేడు విచారణ
ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.

ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. బీఆర్ఎస్కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి మారడంపై హైకోర్టులో నేడు వాదనలు జరగనున్నాయి. ఈరోజు ఎమ్మెల్యేల తరుపున న్యాయవాదులు తమ వాదనలను వినిపించనున్నారు. ఇప్పటికే ఏజీ తరుపున తమ వాదనలను విన్న హైకోర్టు నేడు ఎమ్మెల్యేల తరుపున వాదనలు విననుంది.
బీఆర్ఎస్ లో గెలిచి...
బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడాన్ని తప్పు పడుతూ బీఆర్ఎస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరింది. దీనిపై వాదనలు విన్న తర్వాత తీర్పు వెలువరించనుంది. మరోవైపు స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్థానాలు తప్పుపట్టలేవన్న వాదనను కూడా నిన్న అసెంబ్లీ సెక్రటరీ తరుపున న్యాయవాదులు తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు కూడా విచారణ సాగనుంది.
Next Story

