Fri Dec 05 2025 13:38:38 GMT+0000 (Coordinated Universal Time)
నేడు గాలి జనార్థన్ రెడ్డి పిటీషన్ పై తీర్పు
ఓబులాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది

ఓబులాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. గాలి జనార్ధన్ రెడ్డితో పాటు మరికొందరు దాఖలు చేసుకున్న పిటీషన్లను ఇప్పటికే విచారించిన హైకోర్టు తీర్పు నేడు వెలువరించనుంది. గాలి జనార్థన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వీడీ రాజగోపాల్, అలీఖాన్ లు ఈ పిటీషన్లు దాఖలు చేశారు. ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు వీరికి ఏడేళ్లు శిక్ష వేస్తూ తీర్పు చెప్పింది. తాము ఇప్పటికే యాభై శాతానికి పైగా శిక్ష అనుభవించామని, ఇక మూడున్నరేళ్ల శిక్ష మాత్రమే మిగిలి ఉందని, అయితే జైలు శిక్ష సస్పెన్షన్ పైనే నిన్న వాదనలు కొనసాగాయి.
శాసనసభ్యత్వం కోల్పోకుండా...
శాసనసభ్యత్వం కోల్పోకుండా ఉండాలంటే సీబీఐ కోర్టు తీర్పును సస్పెండ్ చేయాలని పిటీషనర్ల తరుపున న్యాయవాదులు కోరారు. శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ కార్యదర్శి గత నెలలో నోటిఫికేషన్ జారీ చేశారని, ఖాళీ అయిన స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ వస్తే కోలుకోలేని నష్టం కలుగుతుందని వాదించారు. జైలు శిక్షపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. అదే సమయంలో ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పిటీషన్ పై కూడా విచారణ జరిగే అవకాశముంది.
Next Story

