Wed Apr 08 2026 13:01:23 GMT+0530 (India Standard Time)
Telangana : కాళేశ్వరంపై తెలంగాణ హైకోర్టు వాయిదా
కాళేశ్వరంపై తెలంగాణ హైకోర్టు తీర్పు ను వాయిదా వేసింది.

తెలంగాణ హైకోర్టు తీర్పు ను వాయిదా వేసింది. ఈ నెల 22వ తేదీకి తీర్పును వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ పై నేడు కీలక తీర్పుచెప్పాల్సి ఉండగా వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని రేవంత్ సర్కార్ నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంపై ఈరోజు తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పాల్సి ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో...
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ కేసీఆర్, హరీశ్‌రావు, స్మితాసబర్వాల్, ఎస్కే జోషి పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వు చేసింది. ఈరోజు హైకోర్టు తీర్పును వెల్లడించాల్సి ఉండగా తీర్పును ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.
Next Story

