Wed Mar 25 2026 13:41:06 GMT+0530 (India Standard Time)
Telangana : ఏడుగురు ఎమ్మెల్యేలు, స్పీకర్ కు హైకోర్టు నోటీసులు
తెలంగాణ హైకోర్టు స్పీకర్ తో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది

తెలంగాణ హైకోర్టు స్పీకర్ తో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. పార్టీ పిరాయింపుల ఎమ్మెల్యే లపై స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడంతో మరోసారి బిఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు లో బిఆర్ఎస్ పార్టీ పిటీషన్ ను విచారించిన ధర్మాసనం ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది.
వచ్చే నెల 16వ తేదీకి...
కౌంటర్ దాఖలు చేయాలని ఏడుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 16వ తేదీకి తిరిగి విచారణను వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.
Next Story

