Tue Feb 03 2026 20:08:35 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు సీరియస్
తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ పై సీరియస్ అయింది. వచ్చే సోమవారం తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది

తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ పై సీరియస్ అయింది. వచ్చే సోమవారం తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని హైకోర్టు ప్రశ్నించింది. వచ్చే సోమవారం 10.30 గంలకు ఖచ్చితంగా న్యాయస్థానానికి హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
హాజరు కావాలంటూ..
వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా న్యాయస్థానంలో హాజరు కావాల్సి ఉందని పేర్కొంది. కోర్టు ఆదేశాలను థిక్కరించి మరీ భవనాలను కూల్చివేయడం ఏంటని ప్రశ్నించింది. అమీన్పూర్ లో ఒక భవనాన్ని కూల్చివేసిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో హైడ్రా కమిషనర్ న్యాయస్థానానికి ఏం వివరణ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story

