Mon Mar 23 2026 00:06:22 GMT+0530 (India Standard Time)
మూవీ టిక్కెట్ల ధరలను పెంచుకునేందుకు అనుమతి
మూవీ టిక్కెట్ల ధరలను పెంచుకునేందుకు థియేటర్ల యాజమాన్యానికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.

మూవీ టిక్కెట్ల ధరలను పెంచుకునేందుకు థియేటర్ల యాజమాన్యానికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు త్వరలో విడుదలవుతున్నాయని, వీటికి ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని థియేటర్ల యజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.
భారీ బడ్జెట్ సినిమాలకు...
త్వరలో అఖండ, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతున్నాయని, వీటి ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని వారు కోరారు. ప్రభుత్వాన్ని కోరితే స్పందించడం లేదని పేర్కొన్నారు. దీంతో హైకోర్టు టిక్కెట్ కు యాబై రూపాయలు పెంచుకునేందుకు హైకోర్టు అనుమతిచ్చింది.
Next Story

