Wed Dec 06 2023 12:15:25 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు జరిమానా
భారత రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేకు తెలంగాణ హైకోర్టు జరిమానా విధించింది

భారత రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేకు తెలంగాణ హైకోర్టు జరిమానా విధించింది. పదివేల రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. 2018 ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన అఫడవిట్లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారంటూ ఆమెపై కేసు నమోదయింది. దీనిపై విచారించిన తెలంగాణ హైకోర్టు పది వేల రూపాయల జరిమానాను విధించింది.
అఫడవిట్లో...
ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత 2018 ఎన్నికల్లో తప్పుడు అఫడవిట్ ఇచ్చారంటూ అదే నియోజకవర్గానికి చెందిన బోరెడ్డి అయోధ్యరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు ఇప్పటి వరకూ ఎమ్మెల్యే గొంగిడి సునీత కౌంటర్ పిటీషన్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబరు 3వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అదే రోజు విచారణకు వాయిదా వేసింది.
Next Story