Fri Dec 05 2025 12:19:29 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : హిల్ట్ పాలసీపై హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన హిల్ట్ పాలసీపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక హైదరాబాదు ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై దాఖలయిన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. వ్యాజ్యాలపై పలు ప్రశ్నలు లేవనెత్తిన తర్వాత జస్టిస్‌లు పి. సామ్ కోషీ, సుద్దల చలపతి రావు ఉన్న డివిజన్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత పక్షాలు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం తీసుకు వచ్చిన హిల్ట్ పాలసీపై తదుపరి విచారణను డిసెంబర్ 29కు వాయిదా వేసింది.
జీవో 27 రద్దు చేయాలంటూ...
పిల్ దాఖలు చేసిన వారిలో ఒకరైన రిటైర్డ్ ప్రొఫెసర్ కె. పురుషోత్తం రెడ్డి… నవంబర్ 22న జారీ చేసిన జీవో నెంబరు 27ను రద్దు చేయాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. పరిశ్రమ ప్రాంతాల్లో భారీ స్థాయిలో నివాస, వాణిజ్య నిర్మాణాల వల్ల కలిగే పర్యావరణ ప్రభావంపై ప్రత్యేక అధ్యయనం చేయాలని కోరారు. పరిశ్రమ ప్రాంతాల్లో నివాస సముదాయాలు నిర్మాణాలు కలిగే ఆరోగ్యపరమైన ఇబ్బందులను కూడా ప్రభుత్వం అంచనా వేయాలని రెడ్డి కోర్టులో తెలిపారు.
Next Story

