Sat Dec 13 2025 22:33:20 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. గ్రూప్ 2 రద్దు
2015-16 లో జరిగిన గ్రూప్ 2 పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2015-16 లో జరిగిన గ్రూప్ 2 పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. నాటి ఎంపిక జాబితాను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో పాటు సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా డబుల్ బబ్లింగ్, వైట్ నర్ వినియోగం, తుడిపివేతలనున్న పార్ట్ బి పత్రాతను పునర్ మూల్యాంకనం చేయడం చెల్లదని హైకోర్టు చెప్పింది.
రెండు వారాల్లో...
హైకోర్టు తీర్పు, సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా వ్యవహరించే అధికారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. 2019 అక్టోబరు24న విడుదల చేసిన ఫలితాలు చట్టవిరుద్ధమని పేర్కొంది. వాటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సాంకేతిక కమిటీ సిఫార్సులు, హైకోర్టు తీర్పునకు అనుగుణంగా తిరిగి మూల్యాంకనం నిర్వహించి అర్హుత జాబితాను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని, ఈ ప్రక్రియను ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం
Next Story

