Fri Apr 10 2026 13:56:31 GMT+0530 (India Standard Time)
Telangana : పవన్ ఖేరాకు హైకోర్టులో ఊరట
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది

కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అసోం ముఖ్యమంత్రి హిమంత భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదయింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పవన్ ఖేరా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
వారం రోజుల వరకూ...
దీనిపై విచారించిన తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులకు విచారణకు సహకరించాలని హైకోర్టు పవన్ ఖేరాను ఆదేశించింది. వారంరోజుల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారంలోగా రెగ్యులర్ బెయిల్ అసోం కోర్టులో వేసుకోవాలని సూచించింది.
Next Story

