Fri Dec 05 2025 23:16:40 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : హైకోర్టు స్టే ఇస్తే రేవంత్ రెడ్డిదే తప్పిదమా? రాజకీయ దుమారం
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది

బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లపై విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశం జారీ చేసింది. రెండు వారాల్లోపు అన్ని పార్టీలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కూడా నిలుపుదల చేసింది. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ కూడా ఇక చెల్లుబాటు కాదు. జీవో నెంబరు 9 ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. జీవో నెంబరు 9పై హైకోర్టు స్టే విధించడంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నిలుపుదల చేశాయి.
రాజకీయ దుమారం...
అయితే దీనిపై రాజకీయ దుమారం చెలరేగుతుంది. కాంగ్రెస్ పార్టీ దీనికి కారణమని ప్రత్యర్థి పార్టీలు విమర్శలకు దిగాయి. న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని అంటున్నాయి. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు వద్ద నినాదాలు కూడా చేశారు. బీసీ రిజర్వేషన్లను కావాలని ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు లాక్కున్నారని ఆరోపించారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాదలను మరొక విధంగా ఉన్నాయి. తొలుత కులగణన చేసింది తమ ప్రభుత్వమేనని, కులగణన ఆధారంగా అసెంబ్లీలో చర్చించి బీసీలకు రిజర్వేషన్ 42 శాతం ఇవ్వాలంటూ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపారు. పార్లమెంటులో ఈ బిల్లుకు ఆమోదం లభించలేదు.
పార్టీల వాదన ఇదీ...
మరొకవైపు బిల్లును తీసుకు వచ్చారు. బిల్లును గవర్నర్ వద్దకు పంపారు. గవర్నర్ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్ కు బిల్లు వెళ్లింది. దీంతో జీవో నెంబరు 9 ని విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టంబరు 30వ తేదీలోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని నిర్ణయించడంతో అందుకు ప్రభుత్వం కూడా సిద్ధమయింది. అందుకు అనుగుణంగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయిందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు.మరొకవైపు బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధత లభించకపోయినా తమ పార్టీ తరుపున స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్దయెత్తున ఆందోళన చేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. మరొకవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం రేవంత్ రెడ్డి కుట్రలో మరోసారి బీసీలు బలయ్యారని ఆరోపించారు. మొత్తం మీద హైకోర్టు ఆదేశాలు తెలంగాణలో రాజకీయంగా హీట్ ను రేకెత్తించాయి.
Next Story

