Tue Jan 20 2026 20:36:24 GMT+0000 (Coordinated Universal Time)
రికార్డు స్థాయికి మద్యం అమ్మకాలు.. నల్గొండ జిల్లా టాప్
గడప దాటి అడుగు బయట పెట్టాలంటేనే ప్రజలకు వెన్నులో వణుకు పుట్టింది. 44,45 డిగ్రీల ఎండ, ఉక్కపోత, కొన్ని ప్రాంతాల్లో..

నిన్న, ఈరోజు కాస్త మోస్తరు వర్షాలతో అక్కడక్కడా వాతావరణం చల్లబడింది కానీ.. మొన్నటి వరకూ మాత్రం ఎండలు ఠారెత్తించాయి. గడప దాటి అడుగు బయట పెట్టాలంటేనే ప్రజలకు వెన్నులో వణుకు పుట్టింది. 44,45 డిగ్రీల ఎండ, ఉక్కపోత, కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల ధాటికి ఇవేం ఎండల్రా బాబు అనుకున్నారు ప్రజలు. ఈ ఎండలు భరించలేక బీర్లు గటగటా లాగించేశారట తెలంగాణ వాసులు. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం.. మే 1వ తేదీ నుండి 18వ తేదీ వరకూ 18 రోజుల్లో రూ.583 కోట్ల విలువైన బీర్ల అమ్మకాలు జరిగాయి. అన్నికోట్ల విలువైన బీర్లను మనోళ్లు గుటుక్కున మింగేశారు మరి.
మొత్తం 35,25,247 కాటన్లు బీర్లు అమ్ముడైనట్లు డేటా చెబుతోంది. ఈ లెక్కన మే నెల ముగిసే సమయానికి ప్రభుత్వ ఖజానాకు కేవలం బీర్ల అమ్మకాలతోనే రూ.1000 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం లేకపోలేదు. బీర్ సేల్స్ లో రాష్ట్రంలో నల్గొండ జిల్లా టాప్ లో ఉంది. నల్గొండలో రూ.48.14 కోట్ల విలువైన బీర్లు తాగేశారు. ఆ తర్వాతి స్థానంలో కరీంనగర్ జిల్లా ఉంది. ముదిరిన ఎండలకు తోడు.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో లిక్కర్ సేల్స్ పెరిగాయంటున్నారు ఎక్సైజ్ అధికారులు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. లిక్కర్ విక్రయాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
Next Story

