Fri Oct 11 2024 07:48:24 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలో కామన్ మొబిలిటీ కార్డు.. ఎక్కడెక్కడ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి
మంత్రులు కే. తారకరామారావు, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో..
హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా మొత్తానికి ఉపయోగపడేలా తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేస్తోంది. అదే కామన్ మొబిలిటీ (Common Mobility Card). ఈ కార్డుతో నగర పౌరులు వివిధ రకాల (Metro, TSRTC) ప్రజా రవాణా సేవలను సజావుగా యాక్సెస్ చేయడానికి వీలుంటుంది. తద్వారా నగల ప్రజల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా చేస్తుంది. రాబోయే కామన్ మొబిలిటీ కార్డ్‌తో, ప్రయాణికులు ప్రజా రవాణా వ్యవస్థలో RTC బస్సులు, మెట్రో రైలు, MMTS, క్యాబ్‌లు, ఆటోలతో సహా వివిధ సౌకర్యాలను పొందగలుగుతారు. ఈ కార్డు తొలుత హైదరాబాద్ నగరంలో ప్రయోగాత్మకంగా జారీ చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. ఆ తర్వాత తెలంగాణ అంతటా కామన్ మొబిలిటీ (Common Mobility Card) విస్తరణ చేస్తామన్నారు.
గురువారం మంత్రులు కే. తారకరామారావు, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆర్టీసీ, మెట్రో రైల్ సంస్థల ఉన్నతాధికారులు ఈ కార్డుకు సంబంధించిన పలు వివరాలను అందించారు. ఈ కార్డు జారీ ప్రక్రియ నుంచి మొదలుకొని వివిధ ప్రాంతాల్లో దాని ఉపయోగం వరకు, నగర ప్రజలకు అందుబాటులో ఉండే సేవల వివరాలను అధికారులు మంత్రులకు తెలియజేశారు. తొలుత మెట్రో రైల్, ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి వీలుగా ఈ కార్డుని జారీ చేస్తామని, భవిష్యత్తులో ఇదే కార్డుతో ఎంఎంటీఎస్, క్యాబ్, ఆటోల సేవలను కూడా వినియోగించుకునేలా మార్పులు చేస్తామని మంత్రులు వెల్లడించారు. అలాగే ఇతర కార్డుల మాదిరిగా కామన్ మొబిలిటీ (Common Mobility Card)తో కూడా కొనుగోళ్లు చేసేలా వన్ కార్డ్ ఫర్ ఆల్ నీడ్స్ గా ఉండాలని అధికారులకు సూచించారు.
కామన్ మొబిలిటీ (Common Mobility Card) పొందిన పౌరులు దేశవ్యాప్తంగా వినియోగించుకునేందుకు అవకాశం ఉన్న ప్రతిచోట వాడుకోవచ్చని మంత్రులు వివరించారు. ఇతర మెట్రో నగరాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆర్టీసీ బస్సులు లేదా మెట్రో రైల్, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కామన్ మొబిలిటీ (Common Mobility Card)ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్ లో ఆగస్టు 2వ వారంలోగా నగర పౌరులకు కామన్ మొబిలిటీ (Common Mobility Card) అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు.
Next Story