Mon Dec 08 2025 00:26:51 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఢిల్లీకి గవర్నర్ తమళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ మరికాసేపట్లో ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ మరికాసేపట్లో ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన సాయంత్రం నాలుగు గంటలకు అమిత్ షా తో భేటీ కానున్నారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై గవర్నర్ తమిళి సై హోంమంత్రి అమిత్ షాకు వివరించనున్నారని తెలిసింది. ఈ నెల 12న ప్రధాని తెలంగాణ పర్యటనపై కూడా తమిళి సై చర్చించనున్నారని చెబుతున్నారు.
తాజా పరిణామాలపై...
ఇటీవల ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం కుదిపేసింది. ఈ సంఘటనపై ముగ్గురు అరెస్టయ్యారు. ఢిల్లీ పెద్దల పేర్లు కూడా ఇందులో వినిపించాయి. ప్రధానంగా దీనిపైన వివరించే అవకాశాలున్నాయని తెలిసింది. అలాగే మునుగోడు ఉప ఎన్నికల్లో అధికారులు వ్యవహరించిన తీరుపై కూడా ఆమె అమిత్ షాకు తెలియజేయనున్నారని సమాచారం.
Next Story

