Fri Mar 20 2026 20:36:58 GMT+0530 (India Standard Time)
నేడు ఢిల్లీకి తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ నేడు ఢిల్లీ వెళుతున్నారు. అక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ నేడు ఢిల్లీ వెళుతున్నారు. అక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మరికొందరితో భేటీ అయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. కేంద్ర హోం మంత్రితో రాష్ట్ర పరిస్థితులపై తమిళిసై సౌందర్యరాజన్ చర్చించనున్నారు. గవర్నర్ విషయంలో అధికారులు, పాలకులు ప్రొటోకాల్ పాటించకపోవడం వంటి అంశాలపై మాట్లాడనున్నారు.
రాజకీయ పరిస్థితులపై...
దీంతో పాటు తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కూడా తమిళి సై చర్చించనున్నారని తెలిసింది. ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య ఇటీవల గ్యాప్ పెరగడంతో గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి.
Next Story

