Mon Dec 08 2025 06:55:42 GMT+0000 (Coordinated Universal Time)
నేడు గవర్నర్ వద్దకు కాంగ్రెస్ నేతలు
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ ను నేడు కాంగ్రెస్ నేతలు కలకవనున్నారు.

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ ను నేడు కాంగ్రెస్ నేతలు కలకవనున్నారు. తెలంగాణలో తలెత్తిన శాంతిభద్రతల సమస్యలపై వారు గవర్నర్ కు వినతి పత్రాన్ని సమర్పించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ తో సమావేశమై రాష్ట్రంలో మహిళపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాల గురించి చర్చించనున్నారు.
శాంతిభద్రతల సమస్యపై....
ఇటీవల తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో బాలికల కిడ్నాప్ లు, గ్యాంగ్ రేప్ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇందులో ప్రముఖుల పిల్లలు కూడా భాగస్వామ్యులయి ఉన్నారు. పోలీసులు సక్రమంగా విచారణ చేయడం లేదని, ప్రముఖుల పిల్లను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా శాంతిభద్రతల విషయంలో పట్టించుకోవడం లేదని గవర్నర్ దృష్టికి తేనున్నారు. తెలంగాణ మహిళ కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, రేణుకాచౌదరి, సీతక్క, కొండా సురేఖ తదితరులు గవర్నర్ ను కలిసి శాంతిభధ్రతలపై చర్చించనున్నారు.
Next Story

