Sat Mar 07 2026 17:31:40 GMT+0530 (India Standard Time)
వరద బాధితులతో తమిళి సై
గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ పర్యటిస్తున్నారు

గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ పర్యటిస్తున్నారు. శనివారం రాత్రి రైలు మార్గం ద్వారా బయలు దేరిన తమిళి సై కొత్తగూడెంకు చేరుకున్నారు. అక్కడి నుంచి మణుగూరుకు వెళ్లారు. అక్కడ నుంచి భద్రాచలం వెళ్లి వరద బాధితులను గవర్నర్ తమిళిసై పరామర్శిస్తారు. వారికి అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీస్తారు. స్వయంగా బాధితుల కష్టాలను తెలుసుకునేందుకు తమిళి సై వరద ప్రాంతంలో పర్యటిస్తున్నారు.
బాధితులను నేరుగా...
రెడ్ క్రాస్, ఇతర స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన సామాగ్రిని వరద బాధితులకు తమిళిసై పర్యటించనున్నారు. పునరావాస కేంద్రాలను సందర్శించనున్నారు. వరద నష్టాన్ని కూడా అంచనా వేయనున్నారు. తాను ఎవరికీ పోటీగా పర్యటన చేపట్టలేదని, మానవతా థృక్ఫథంతోనే వరద ప్రాంతంలో పర్యటిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. నిజానికి ఈరోజు గవర్నర్ ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇది రాజకీయంగా టీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది.
Next Story

