Fri Mar 20 2026 05:45:20 GMT+0530 (India Standard Time)
నేడు ఢిల్లీకి గవర్నర్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై గవర్నర్ చర్చించనున్నారు. ఇటీవల రెండు మూడు బిల్లులను ఆమోదించిన తమిళిసై కొన్ని బిల్లులను మాత్రం ఇంకా తన వద్దనే పెండింగ్లో పెట్టుకున్నారు. రెండు బిల్లులను రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపారు. మరో రెండు బిల్లులను తిరస్కరిస్తూ ప్రభుత్వానికి తిప్పి పంపారు.
బిల్లులు ఆపడంపై...
ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో గవర్నర్ బిల్లులను పెండింగ్లో పెట్టడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను ఏ పరిస్థితుల్లో ఏ బిల్లులు ఆపవలసి వచ్చిందో తమిళిసై సౌందర్ రాజన్ కొందరు కేంద్ర మంత్రులను కలసి వివరించనున్నారు. అంతే కాకుండా తనకు ప్రొటోకాల్ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపైనా ఫిర్యాదు చేయనున్నారు.
Next Story

