Sun Mar 15 2026 13:25:35 GMT+0530 (India Standard Time)
Amitshah: అమిత్ షాతో గవర్నర్ భేటీ
తెలంగాణ గవర్నర్ తమిళిసై పౌందర్ రాజన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.

Amitshah meets Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. శనివారం సాయంత్రం ఢిల్లీలో అమిత్ షాను కలిసి తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులతో పాటు రాజకీయ పరిణామాలను కూడా వివరించినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి అమిత్ షాను కలిసి ఆ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను గురించి వివరించారు.
పుదుచ్చేరి విషయాలపై...
దీంతో పాటు పుదుచ్చేరికి సంబంధించిన రాజకీయ పరిణామాలను కూడా చర్చించారని చెబుతున్నారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని రాజ్‌భవన్ వర్గాలు స్పష్టం చేశాయి.
Next Story

