Thu Jan 29 2026 10:31:41 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తమిళి సై షాతో భేటీ
తెలంగాణ గవర్నర్ తమిళిసై నేడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నేడు తమిళిసై కలవనున్నారు

తెలంగాణ గవర్నర్ తమిళిసై నేడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నేడు తమిళిసై కలవనున్నారు. నిజానికి నిన్ననే వెళ్లాల్సి ఉండగా అమిత్ షా కార్యక్రమాల కారణంగా వాయిదా పడింది. ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ భేటీ కానున్నారు. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులను ఆమె అమిత్ షాకు వివరించనున్నారు. గత కొద్ది రోజులుగా గవర్నర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని కూడా అమిత్ షా దృష్ఠికి తమిళిసై తేనున్నారు.
దూరం పెరగడంతో....
గత కొంతకాలంగా గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ల మధ్య గ్యాప్ వచ్చింది. బడ్జెట్ సమావేశాల నుంచి ఇది మరింత పెరిగింది. తమిళిసై కార్యక్రమాల్లో అధికారులు పాల్గొనేందుకు కూడా ఇష్టపడనంత దూరం పెరిగింది. సమ్మక్క సారలమ్మ జాతర, యాదాద్రి పర్యటనలో ఈ విషయం స్పష్టమయింది. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నారు తమిళిసై. మరి ఢిల్లీ డైరెక్షన్ ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది.
Next Story

