Mon Dec 08 2025 06:51:26 GMT+0000 (Coordinated Universal Time)
ఎవరికి భయపడను.. భయపడబోను
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ భయపడబోనని, భయపడే వ్యక్తిని కాదని తెలిపారు

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ భయపడబోనని, భయపడే వ్యక్తిని కాదని తెలిపారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఏ మహిళ భయపడకూడదన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా మహిళలపై వివక్ష తొలిగిపోలేదన్నారు. అత్యున్నత స్థాయిలో ఉన్న మహిళలకు కూడా అవమానాలు జరుగుతున్నాయని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
స్వేచ్ఛగా నిర్ణయాలు....
భారతీయ మహిళలు ఎవరికీ భయపడరని, తాను కూడా భయపడబోనని తెలిపారు. మహిళ ఎప్పుడూ తన స్వార్థం కోరుకోదని, కుటుంబం, సమాజం బాగుండాలని కోరుకుంటుందని ఆమె తెలిపారు. మహిళలు ఆర్థికపరమైన విషయాల పట్ల స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ పిలుపు నిచ్చారు.
Next Story

