Wed Jan 21 2026 00:42:03 GMT+0000 (Coordinated Universal Time)
బాసర ట్రిపుల్ ఐటీలో గవర్నర్
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ యూనివర్సిటీల సందర్శనకు బయలుదేరారు. బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు.

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ యూనివర్సిటీల సందర్శనకు బయలుదేరారు. బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి బయలు దేరిన గవర్నర్ ఈరోజు ఉదయం బాసర సరస్వతి దేవి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన గవర్నర్ కు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. అక్కడి విద్యార్ధులతో సమావేశమయ్యారు.
వారితో కలసి....
వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా మెస్ తో ఇబ్బందులు పడుతూ విద్యార్థులు కొంతకాలం నుంచి అనారోగ్యం పాలవుతున్నారు. వారితో కలిసి గవర్నర్ టిఫిన్ చేశారు. అధికారులతో గవర్నర్ సమీక్ష నిర్వహించారు. సమస్యలను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు నిజామాబాద్ యూనివర్సిటీని కూడా గవర్నర్ సందర్శించనున్నారు. అక్కడి సమస్యలను కూడా విద్యార్థులను అడిగి తెలుసుకోనున్నారు.
Next Story

