Sun Dec 07 2025 13:01:37 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిల అరెస్ట్ ఘటన కలచివేసింది
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్ పై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్ పై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్ ఆరా తీశారు. కారులో ఉండగానే షర్మిలను లాక్కుని వెళ్లిన ఘటన తనను కలిచివేసిందని గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్ పేర్కొన్నారు.
మహిళను...
రాజకీయ సిద్ధాంతాలు వేరైనా, భావాలు వేరైనా మహిళలను గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉందని తమిళిసై అభిప్రాయపడ్డారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని, కానీ అందులో కూడా కొన్ని మౌలిక సూత్రాలను పాటించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఇకమీదైనా పోలీసులు మహిళలను అరెస్ట్ చేసే సమయంలో సంయమనంతో వ్యవహరిస్తే బాగుంటుందని సూచించారు.
Next Story

