Mon Mar 16 2026 00:49:21 GMT+0530 (India Standard Time)
నేడు భద్రాచలానికి గవర్నర్
నేడు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ భద్రాచలంలో పర్యటించనున్నారు.

నేడు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ భద్రాచలంలో పర్యటించనున్నారు. రైలు మార్గం ద్వారానే ఆమె భద్రాద్రికి చేరుకున్నారు. తెల్లవారు జామున రైలులో కొత్తగూడెం చేరుని అక్కడి సారపాకలోని ఐటీసీ గెస్ట్ హౌస్ కు వెళ్లి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం అక్కడ బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత రోడ్డు మార్గంలో ఉదయం 8.40 గంటలకు భద్రాచలం చేరుకుంటారు.
వివిధ కార్యక్రమాల్లో...
సీతారామచంద్రస్వామిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్న అనంతరం భద్రాద్రితో పాటు ఖమ్మం జిల్లాలో జరిగే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారని గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గిరిజనులు సదస్సులో పాల్గొంటారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భోజనం చేసిన తర్వాత రోడ్డు మార్గాన ఖమ్మం చేరుకుని అక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Next Story

