Sat Mar 07 2026 14:39:49 GMT+0530 (India Standard Time)
నేడు వేములవాడకు గవర్నర్
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ నేడు వేములవాడలో పర్యటించనున్నారు

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ నేడు వేములవాడలో పర్యటించనున్నారు. సద్దుల బతుకమ్మ వేడుకలో పాల్గొననున్నారు. వేములవాడలో మాత్రమే ఏడు రోజులకు సద్దుల బతుకమ్మ జరుగుతుంది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు కొలువైన క్షేత్రం కావడంతో ఈ రోజు అమ్మవారు సప్త మాతృకల రూపంలో భక్తులకు దర్శనమిస్తారు.
సద్దుల బతుకమ్మ వేడుకల్లో....
తెలంగాణలో మెట్టినిల్లు, పుట్టినింట్లో బతుకమ్మ జరుపుకునే అవకాశం వేములవాడ మహిళలకు మాత్రమే ఉంది. ఏడు రోజులకు జరగనున్న సద్దుల బతుకమ్మ వేడుకలో పాల్గొనేందుకు గవర్నర్ నేడు వేముల వాడకు వస్తున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

