Fri Dec 05 2025 15:53:57 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ మరోసారి కామెంట్స్
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ నేడు భద్రాచలంలో పర్యటించనున్నారు.

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ నేడు భద్రాచలంలో పర్యటించనున్నారు. గిరిజన సదస్సులో గవర్నర్ పాల్గొననున్నారు. గవర్నర్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిన్న తిరుమలలో పర్యటించిన గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు చేశారురు. తెలంగాణ ప్రభుత్వం నుంచి తనకు నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదని గవర్నర్ అన్నారు.
కొత్త సచివాలయానికి...
తిరుమలలో బ్రేక్ సమయంలో మార్పు తీసుకురావడం చాలా మంచి నిర్ణయంమని గవర్నర్ అభిప్రాయపడ్డారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని ముందు అందరూ సమానమే అంటూ టీటీడీ తీసుకున్న నిర్ణయం ఆనందదాయకమని ప్రశంసించారు. సచివాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వనించామని మంత్రులు పేర్కోనడంతోనే తాను ఆహ్వనం అందలేదని చెప్పాల్సి వచ్చిందన్నారు. ఆహ్వనం పంపలేదని తాను ఎవరిని అడగలేదని గవర్నర్ అన్నారు.
Next Story

