Sat Mar 07 2026 14:42:03 GMT+0530 (India Standard Time)
Big Breaking : గవర్నర్ పదవికి తమిళి సై రాజీనామా
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. ఆమె రానున్న లోక్సభ ఎన్నికల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం కూడా ఇందుకు అంగీకరించడంతో ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారని చెబుతున్నారు.
చెన్నై సెంట్రల్ నియోజకవర్గం నుంచి..
తమిళనాడులోని చెన్నై సెంట్రల్ నియోజకవర్గం లేదా తూత్తుకుడి నుంచి తమిళి సై సౌందర్ రాజన్ పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ మేరకు బీజేపీ నాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది. తెలంగాణ గవర్నర్ గా రాకముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళి సై సౌందర్ రాజన్ మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు.
Next Story

