Thu Jan 29 2026 13:26:45 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ తమిళి సై కీ కామెంట్స్
తెలంగాణ గవర్నర్ తమిళి సైకీలక వ్యాఖ్యలు చేశారు. తనకు, ముఖ్యమంత్రికి మధ్య గ్యాప్ తొలిగిపోలేదన్న రీతిలో మాట్లాడారు

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు, ముఖ్యమంత్రికి మధ్య గ్యాప్ తొలిగిపోలేదన్న రీతిలో మాట్లాడారు. ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారానికి హాజరయిన తమిళి సై అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇటీవల హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం సందర్భంగా కేసీఆర్ రాజ్భవన్ కు వచ్చారని, అయితే తాము ఇద్దరం కలసి కూర్చుని మాట్లాడుకున్న తర్వాత కూడా ప్రొటోకాల్ లో మార్పు లేదని తమిళి సై చెప్పారు.
ముందస్తుకు వెళ్లరు...
వరదల సమయంలో తాను భద్రాచలంలో పర్యటించినప్పుడు కనీసం కలెక్టర్ కూడా రాలేదన్నారు. మా మధ్య సంబంధం స్టేటస్ కో లోనే ఉందని ఆమె తెలిపారు. ఎలాంటి మార్పు లేదని తమిళి సై సౌందర్ రాజన్ తెలిపారు. అయితే గవర్నర్ గా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని ఆమె స్పష్గం చేశారు. ప్రభుత్వం సహకరించినా, సహకరించకపోయినా తన పని తాను చేసుకుని వెళుతూనే ఉంటానన్నారు. వరదలపై కేంద్రానికి నివేదిక ఇచ్చానని, అందుకే కేంద్ర బృందం పర్యటించి వెళ్లిందని తమిళి సై సౌందర్ రాజన్ తెలిపారు. తాను రాజకీయాలు చేయనని, ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే వచ్చానని ఆమె తెలిపారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
Next Story

