Sat Jan 31 2026 00:26:57 GMT+0000 (Coordinated Universal Time)
వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి ... ఆంక్షలపై నేడు?
కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా తొలి విడత వ్యాక్సినేషన్ ను వంద శాతం పూర్తి చేసింది.

కరోనా కట్టడికి తొలి నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా తొలి విడత వ్యాక్సినేషన్ ను వంద శాతం పూర్తి చేసింది. రెండో డోసులు కూడా 61 శాతం పూర్తయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కరోనా తొలి, రెండు వేవ్ లలోనూ తెలంగాణలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలోనే నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు చికిత్స కోసం వచ్చే పరిస్థితి రావడంతో ప్రభుత్వం ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత లేకుండా చూసింది.
వేడుకలపై....?
ఇక ఇప్పుడు ఒమిక్రాన్ విషయంలోనూ ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రభుత్వం ఈరోజు ఆంక్షలపై ప్రకటన చేసే అవకాశముంది. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని హైకోర్టు సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇతర రాష్ట్రాల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది.
Next Story

