Fri Dec 05 2025 12:25:10 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణ నిరుద్యోగులకు పండగ... ఒకే సారి ఇరవై వేల ఉద్యోగాల భర్తీ
తెలంగాణ ప్రభుత్వం త్వరలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

తెలంగాణ ప్రభుత్వం త్వరలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు మొదలయింది. ఎస్సీ వర్గీకరణ పూర్తికావడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయి? ఏ ఏ పోస్టులు వంటి విషయాలను తెలియజేయాలని పేర్కొన్నారు. అధికారులు ఈ సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. పూర్తి సమాచారం వచ్చిన వెంటనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వరసగా వెలువడనున్నాయి.
ఎస్సీ రిజర్వేషన్ కు...
అయితే ఇక తెలంగాణలో భర్తీ చేయబోయే ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఎస్సీ రిజర్వేషన్లు అనుకూలంగానే చేయనున్నారు. రోస్టర్ ప్రకారం ఖాళీల వివరాలనువ తెప్పించుకున్న తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమవుతుంది. ఇందుకోసం అధికారులు ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నారు. త్వరలోనే తెలంగాణలో ఇరవై వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని ప్రభుత్వవర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ఊరట కలిగించేలా ప్రభుత్వ ఉద్యోగాలను వీలయినంత త్వరగా ఎక్కువ సంఖ్యలో భర్తీ చేయాలని నిర్ణయించారు.
బ్యాక్ లాగ్ పోస్టులను...
పదవీ విరమణ చేసిన ఖాళీలతో పాటు బ్యాక్ ల్యాగ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఇంత భారీగా ఉద్యోగాల ప్రకటన రావడం ఇదే తొలి సారి అవుతుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇరవై నుంచి ఇరవై ఐదు వేల పోస్టులను భర్తీ చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉందని ఆయన చెప్పారు. వీటిలో ఎక్కువ భాగం టీజీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు. అదే పోలీస్ శాఖలో కూడా అనేక ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిసింది. గురుకులాలతో పాటు వివిధ ఇంజినీరింగ్ విభాగాలు, ఉపాధ్యాయ పో్స్టులు పది వేల వరకూ ఉంటాయని చెబుతున్నారు. విద్యుత్తు సంస్థలో కూడా రెండు నుంచి మూడు వేల ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం మీద ఈ ఏడాది నిరుద్యోగులకు పండగేనని చెప్పాలి.
Next Story

