Mon Mar 23 2026 09:32:27 GMT+0530 (India Standard Time)
రైతులకు గుడ్ న్యూస్.. నేటి నుంచే?
తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి రైతుబంధు నిధులను విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి రైతుబంధు నిధులను విడుదల చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు నుంచి వరసగా రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులను జమ చేయాలని ఆదేశించారు. యాసంగి సీజన్ లో రైతు బంధు పథకం కింద ఈ సాయాన్ని చేయనున్నారు.
ఎకరం నుంచి....
యాసంగి సీజన్ లో మొత్తం 66.61 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు. రైతు బంధు పథకం కోసం ప్రభుత్వం 7645 కోట్ల రూపాయలను సిద్దం చేసింది. ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇచ్చింది. ఒక ఎకరం ఉన్న రైతుల నుంచి ప్రారంభమై రైతులందరికీ ఈరోజు నుంచి రైతు బంధు పథకాన్ని అందచేసేందుకు ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది.
- Tags
- kcr
- raithu bandhu
Next Story

