Fri Dec 05 2025 14:56:58 GMT+0000 (Coordinated Universal Time)
Breaking: రైతులకు గుడ్ న్యూస్...నేటి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. రైతు భరోసా నిధులను నేటి నుంచి జమ చేయనున్నారు

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. రైతు భరోసా నిధులను నేటి నుంచి జమ చేయనున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు మంత్రులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసా నిధులను విడుదల చేయాలని మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. మరికాసేపట్లో రాజేంద్ర నగర్ లో జరిగే రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశముంది. అక్కడి నుంచే బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుండటంతో వెంటనే రైతు భరోసా నిధులను విడుదలచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
ఖరీఫ్ ప్రారంభంలోనే...
రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలను ప్రభుత్వం ఇస్తుంది. తొలి విడత ఎకరం, తర్వాత రెండు ఎకరాలు, తర్వాత మూడు ఎకరాలున్న రైతులకు ఈపెట్టుబడి సాయం గతంలో అందించింది. అయితే ఈసారి ఎకరాలతో సంబంధం లేకుండా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. విడతల వారీగా కాకుండా గతంలో గుర్తించిన లబ్దిదారులకు ఈ దఫా అందరికీ రైతు భరసా నిధులను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. రైతు భరోసా విడుదల కు సంబంధించిన నిధులను కూడా ఇప్పటికే సిద్ధం చేసిన ప్రభుత్వం ఖరీఫ్ లో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయడానికి వీలుగా రేపటి నుంచి విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
నిధులు సిద్ధం చేసి...
రైతు భరోసా ఇప్పటి వరకూ 13 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. తెలంగాణలో రైతు భరోసా నిధులు సాగుకు వీలయ్యే అన్ని భూములకు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దాదాపు1.48 కోట్ల ఎకరాల భూమికి సంబంధించి ఈ దఫా కూడా రైతు భరోసా నిధులను జమ చేయనున్నారు. రైతులకు అండగా నిలిచేందుకు సకాలంలో వారికి సాయం అందించామన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు ఈదఫా ఖరీఫ్ ప్రారంభంలోనే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం నెల నుంచి కసరత్తులు చేస్తున్న ప్రభుత్వం నిధులను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో రేపటి నుంచి రైతు భరోసా నిధులు జమఅవుతాయనితెలిసింది. కేవలం తొమ్మిదిరోజుల్లోనే రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు జమ చేయనున్నారు.
Next Story

