Tue Mar 24 2026 18:58:58 GMT+0530 (India Standard Time)
Telangana : ప్రభుత్వోద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మరియు కార్లపై ఇరవై శాతం వరకు డిస్కౌంట్ అందించే తొలి విధానాన్ని ప్రకటించినట్లు వెల్లడించారు.
ఈవీ వాహనాలను కొనుగోలు చేస్తే...
ఈ కార్యక్రమం ప్రముఖ ఈవీ తయారీ సంస్థలు మహీంద్ర ఎలక్ట్రిక్, ఓలా ఎలక్ట్రిక్, గ్రావ్టన్ మోటార్స్, ఆథర్ ఎనర్జీతో భాగస్వామ్యంలో అమలవుతోందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వోద్యోగులు ఎవరు ఈవీ వాహనాలను కొనుగోలు చేసినా వారికి ఇరవై శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
Next Story

